Balakrishna: బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Balakrishna: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలా బాలయ్య బాబు గత కొంతకాలంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో నటించిన నాలుగు సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇలా ఈ వయసులో కూడా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.

గత సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో మెప్పించిన బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నారు. అఖండ 2 సినిమా దసరాకు రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసారు. బాలకృష్ణ నెక్స్ట్ సినిమా NBK 111 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వీర సింహారెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్న వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే బాలయ్య బాబు గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు లాంటి విషయాలు అన్నీ తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.