మోక్షజ్ఞ మీద బాలయ్య ప్రయోగం.. ఇంత రిస్క్ అవసరమా ?

Balakrishna doing experiment with his son Mokshagna
Balakrishna doing experiment with his son Mokshagna
ప్రయోగాలు నందమూరి బాలకృష్ణకు కొత్తేమీ కాదు. హీరోగా భిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించిన వ్యక్తి ఆయన.  కొత్తదనం అంటే ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. అలాంటి బాలకృష్ణ ఇప్పుడు కుమారుడు మోక్షజ్ఞ మీద ప్రయోగం చేయడానికి రెడీ అయ్యారని టాక్. బాలకృష్ణకు ఎప్పటి నుండో మెగాఫోన్ పట్టి దర్శకత్వం చేయాలనే కోరిక ఉంది. ఆ కోరికను కొడుకుతో నెరవేర్చుకుంటున్నారు.  మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిజానికి మోక్షజ్ఞ సినిమాల్లోకి రాడని నందమూరి అభిమానులు అందరూ ఫిక్సయ్యారు.  
 
బాలకృష్ణ కూడ కొడుకు ఎంట్రీ మీద ఏటూ తేల్చకపోవడంతో ఇక అంతే అనుకున్నారు.  కానీ ఇప్పుడు సమీకరణాలు మారాయి. మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడు. అతని డెబ్యూ సినిమాను బాలకృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. అంతేకాదు అందులో కొడుకుతో కలిసి నటించనున్నాడు.  బాలయ్య హిట్ సినిమాల్లో ఒకటైన ‘ఆదిత్య 369’కు ఇది సీక్వెల్ అంటున్నారు. నిజానికి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయగల దర్శకులు చాలా మందే ఉన్నారు.  బాలకృష్ణ అనుకుంటే వారిలో ఒకర్ని తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బాలకృష్ణ అన్నీ తానే దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే రిస్క్ చేసి దర్శకత్వ భాధ్యతలను తానే తీసుకున్నారట.