Actor Got Covid Positive : బిగ్ న్యూస్ : ‘బాహుబలి’, ‘రాధే శ్యామ్’ కీలక నటునికి కరోనా కలకలం.!

Actor Got Covid Positive : గత రెండు రోజులు నుంచి సౌత్ ఇండియన్ సినిమాకి కరోనా ఫీవర్ ఓ రేంజ్ లో పెరుగుతూ వెళ్తుండడం ఒకింత ఆందోళనగా మారింది. దీనితో అంతా మరింత ఆల్రెడీ అవుతున్నారు మరి జస్ట్ గంటల వ్యవధిలోనే అనేక మంది ప్రముఖ నటులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలు పెద్ద ఎత్తున కలకలం రేపాయి.

మరి మొన్నటి వరకు టాలీవుడ్ సెలెబ్రెటీస్ కు కరోనా సోకి అనేక పాజిటివ్ కేసుకు నిర్ధారణ కాగా ఇప్పుడు తమిళ సినిమాలో ప్రముఖ నటులకి కరోనా పాజిటివ్ రావడం హాట్ టాపిక్ గా మారింది. మరి నిన్న రాత్రే స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తనకి కరోనా వచ్చినట్టు తెలపగా ఇప్పుడు అక్కడ మరియు మన టాలీవుడ్ సినిమాలో నటించిన ప్రముఖ సీనియర్ నటుడు సత్య రాజ్ కి కరోనా వచ్చిందట.

దీనితో ఈయన ఇప్పుడు చెన్నై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన త్వరగా కోలుకోవాలని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి బాహుబలి లో కట్టప్పగా అదరగొట్టిన ఈ నటుడు లేటెస్ట్ గా ప్రభాస్ మరో సినిమా రాధే శ్యామ్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించ సంగతి తెలిసిందే. మరి ఇంకా ఎంతమంది సినీ తారలు ఈ మహమ్మారి బారిన పడతారో ఏంటో.