Auspicious Plants: ఈ వృక్షాన్ని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది..!

Auspicious Plants: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల మొక్కలను వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము. ఈ క్రమంలోనే చాలా రకాల మొక్కలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలా పూజలు నిర్వహించే వాటిలో అరటి, రావి,వేప, తులసి, ఉసిరి వంటి మొక్కలను దైవ సమానంగా భావిస్తాము. ఇదే కాకుండా మర్రిచెట్టును కూడా దైవ వృక్షంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఈ మర్రి చెట్లు శివుడు విష్ణువు బ్రహ్మ కొలువై ఉంటారని మర్రిచెట్టు త్రిమూర్తుల అంశం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మొక్కను దైవ సమానంగా భావించి పూజలు చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఇకపోతే సంతానం లేని వారు మర్రి చెట్టుకు ఉపవాసంతో ఐదు ప్రదక్షిణాలు చేసిన అనంతరం మర్రి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించే కొబ్బరికాయ కొట్టాలి. ఈ విధంగా తొమ్మిది లేదా పదకొండు వారాలు చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు.

అదేవిధంగా 2 సమానంగా ఉన్నటువంటి మరి చెట్లను నాటిన వారికి ఎంతో పుణ్యఫలం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ విధమైనటువంటి మర్రి చెట్లను నాటిన వారు వారి మరణాంతరం వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. అందుకోసమే పెద్దఎత్తున ఎంతో మంది భక్తులు మర్రిచెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు.