బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై దాడి జరిగింది. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో బండి సంజయ్ కారు వెళ్తుండగా.. అడ్డంగించిన దుండగులు.. కారుపై దాడికి యత్నించారు. సంజయ్.. సాయంత్రం పీపుల్స్ ప్లాజాకు వచ్చి అక్కడి నుంచి ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడి నుంచి సంజయ్ కారులో వెళ్తుండగా.. సడెన్ గా అక్కడికి చేరుకున్న కొందరు వ్యక్తులు సంజయ్ కారుపై దాడికి యత్నించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బండి సంజయ్ ని వేరే వాహనంలో అక్కడి నుంచి పంపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. వెనకే ఉన్న సంజయ్ కి చెందిన మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు వాళ్లను అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. బండి సంజయ్ కారుపై దాడి చేసిన వాళ్లు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని.. అందుకే..ఆయన వాహనాలపై దాడి చేశామని టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.