Ashok Galla HERO Movie Trailer : కృష్ణ మేనల్లుడి హీరో ట్రైలర్!

Ashok Galla HERO Movie Trailer : హీరో కృష్ణ మనవడు, ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘హీరో’ ట్రైలర్ ని సోమవారం సాయంత్రం ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేశారు. అశోక్ గల్లా గుంటూరు పార్లమెంటు సభ్యుడు జయదేవ్ గల్లా కుమారుడు కూడా. , హీరో కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి ఘట్టమనేనిని జయదేవ గల్లా వివాహం చేసుకున్నారు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.

చాలా కాలం క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కౌబాయ్, జోకర్ క్యారక్టర్స్ తో అశోక్ గల్లాని విభిన్న గెటప్స్ లో చూపించారు. ఇప్పుడు ట్రైలర్ లో మూవీ కథాంశం పట్ల స్పష్టత వచ్చింది. అశోక్ సినిమాల్లో పెద్ద హీరో అవ్వాలన్న లక్ష్యమున్న యువకుడు. దీనికి తల్లి ప్రోత్సాహం వుంటుంది. తండ్రి వ్యతిరేకిస్తాడు. కలలో బిర్యానీ వండుకుంటే కడుపు నిండదని అంటాడు.

HERO Trailer | Ashok Galla | Nidhhi Agerwal | Sriram Adittya T| Ghibran |  Amararaja Entertainment

 

ఇక నిధి అగర్వాల్ లవ్, లిప్ లాక్ సీన్లున్నాయి. సినిమా షూటింగులు, అశోక్ యాక్టింగులు ఫుల్ స్వింగ్ లో వుంటాయి. చివరికి హీరో అయ్యాడా లేదా అనేది సస్పెన్స్. అశోక్ కొత్త వాడనే బెరుకు లేకుండా ఈజ్ గా, ఫాస్ట్ గా స్పీడ్ పాత్రపోషణ చేశాడు. వెన్నెల కిషోర్, సత్యల కామెడీ ఉంది. జగపతి బాబు ఒక పాత్రలో కాంపిస్తారు. సంక్రాంతికి పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా సినిమా వుండబోతోందని ట్రైలర్ బట్టి తెలుస్తోంది. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది.