ఏపీలో క‌‌రోనా మ‌ర‌ణాలు.. షాకింగ్ రిపోర్ట్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ తీవ్ర‌స్థాయికి చేరుకుంది. ఒక‌వైపు ప్ర‌తిరోజు క‌రోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతుంగా, మ‌రోవైపు కరోనా మ‌ర‌ణాలు కూడా పెరుగున్నాయి. ఇక గ‌త 24 గంట‌ల్లో ఏపీలో 22,304 శ్యాంపిళ్ళ‌ను ప‌రీక్షించ‌గా, కొత్త‌గా 2,593 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, క‌రోనా కార‌ణంగా 40 మంత్రి ప్రాణాలు కోల్పోయార‌ని, రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,044కు చేరుకుంది. ఇక క‌రోనా బారిన ప‌డిన‌ 19,393 మంది కోలుకోగా, క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 492 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం ఏపీలో 18,159 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.