ఎంత సినిమా సెలెబ్రెటీలు అయినా కూడా ఆ హీరో హీరోయిన్ లు కూడా మనలానే సాధారణ మనుషులే కదా! కాకపోతే వారికి ఉన్న ఎక్కువ ఫేమ్ మూలాన ఆడియెన్స్ లో వారు ఏ చిన్న పని చేసినా హైలైట్ గా కనిపిస్తుంది. ఇక ఈ కోవలోనే వారి పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలు కూడా మొహమాటం లేకుండానే షేర్ చేసుకుంటారు.
ఇప్పుడు ఇదే విధంగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన లవ్ స్టోరీ పై కీలక కామెంట్స్ చేసినట్టుగా సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె చెప్పిన తన లవ్ స్టోరీ ఒకింత ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాలి. జెనరల్ గా అబ్బాయిల సైడ్ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీలు వింటాం కానీ ఇక్కడ అనుపమ తన వైపు నుంచి లవ్ ఉన్నట్టు తెలిపింది.
ఈమె ఒకతన్ని లవ్ చేస్తుందట కానీ ఆ విషయం ఇంకా అతడికి చెప్పలేదట. తాను ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నానని ఒకవేళ చెబితే అతడు ఎలా రియాక్ట్ అవుతాడు తన ప్రేమను ఒప్పుకుంటాడా లేదా అనే డైలమాలో తాను ఉన్నానని చెప్పుకొచ్చింది. దీనితో ఈమె కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో మంచి వైరల్ గా మారాయి.
అలాగే అసలు అనుపమ ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతుడు ఎవరు అనే ప్రశ్న కూడా మంచి ఆసక్తిగా మారింది. మరి ఓ శుభదినానన అనుపమ ఏమన్నా గుడ్ న్యూస్ ని ఇస్తుందో లేక తన ప్రేమని తనలోనే దాచుకుంటుందేమో చూడాలి.