Anupam Kher: డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అయినా అనుపమ్ ఖేర్ కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం అనుపమ్ కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది.
సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోకి తాజాగా ఆయన గోడదూకి వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వీడియోని అనుపమ్ షేర్ చేస్తూ తాను ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ పొందలేదు అని ఆయన తెలిపారు. అలాగే ఏదైనా జరగవచ్చు అంటూ హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. నా 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విధాలుగా షూటింగ్ లొకేషన్స్ లోకి అడుగు పెట్టాను. కానీ ఈ రోజు ఇలా సెట్ లోకి వెళ్లడం ప్రత్యేకంగానే కాకుండా చాలా కామెడీగా ఉంది.
ప్రస్తుతం నేను ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నాను. ఈ ప్రయాణాన్ని సాహసోపేతం చేయాలని మా డ్రైవర్ అనుకున్నాడు. మేము ఒక అడవి లాంటి లొకేషన్ కు చేరుకున్నాము. తీరా చూస్తే అది డెడ్ ఎండ్ అని తెలిసింది. కారు రివర్స్ చేద్దామని ప్రయత్నించినప్పటికీ అది వీలుపడలేదు. దాంతో ఏం చేయాలో పాలు పోలేదు. మా కారు పక్కనే సినిమా షూట్ కూడా జరుగుతోంది. దాంతో చేసేది లేక ఇలా గోడ దూకి లొకేషన్ లోకి అడుగుపెట్టాను అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయసులోనూ అనుపమ్ ఈవిధంగా చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరు నిజంగా చాలా గ్రేట్ ఈ వయసులో కూడా అంత ఫిట్ గా ఉన్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఇకపోతే ప్రభాస్, రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విషయానికి వస్తే.. పీరియాడికల్ యాక్షన్ డ్రామగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్ తో సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రభాస్ కు జంటగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.