మన టాలీవుడ్ లో కొన్ని సినిమాల పరిస్థితి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పాలి. థియేటర్స్ లో మంచి ఆదరణ ఉండే చిత్రాలకి ఓటిటి లో గాని టీవీ లోకి వచ్చాక గాని అంత ఆదరణ ఉండదు. అలాగే టీవీ లో హిట్ అయ్యిన సినిమాకి థియేటర్స్ లో ఆదరణ ఉండదు. కొన్ని సినిమాలకు అయితే ముందు అన్నిటిలో ప్లాప్ అయ్యి తర్వాత క్లాసిక్ అవుతాయి.
ఇప్పుడు అలాగే నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా “అంటే సుందరానికి” సినిమా ఫలితం టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. తాను చేసిన ఈ చిత్రం తెలుగులో కమర్షియల్ గా అంత పెద్ద హిట్ కాలేదు. సినిమా కంటెంట్ కూడా బాగానే ఉంది కానీ యూఎస్ మినహా వసూళ్ల పరంగా ప్లాప్ అయ్యింది.
కానీ షాకింగ్ అంశం ఏమిటంటే టీవిలో మొదటి సారి టెలికాస్ట్ కి ఈ సినిమాని తీసుకురాగా దీనికి అసలు రీసెంట్ టైం లో ఏ సినిమాకి కూడా రిజిస్టర్ కానీ అతి తక్కువ రేటింగ్ నమోదు కావడం ఆసక్తిగా మారింది. కేవలం 1.6 రేటింగ్ రావడం అనేది అందరికీ ఒక రకమైన షాక్ లా మారింది.
అసలు దీనికి కారణం ఏమిటి అని అంతా మాట్లాడుకుంటున్నారు. తన లాస్ట్ ప్లాప్ టక్ జగదీష్ కే మా టీవీ లో 10 కి పైగా రేటింగ్ వచ్చింది. కానీ అంటే సుందరానికి కంటెంట్ పరంగా దానికన్నా చాలా ఎంటర్టైనింగ్ సినిమా అయినా కూడా ఇంత దారుణ రేటింగ్ రావడం టాలీవుడ్ ట్రాకర్స్ కి షాకింగ్ గా మారింది. దీనికి కారణం అయితే ఎవరికీ అంతు పట్టడం లేదు.