ప్రభాస్ నుంచి ఊహించని గిఫ్ట్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

ఈరోజు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 25వ సినిమా అనౌన్స్మెంట్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు హైప్ తో ఈ సినిమా ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ భారీ సినిమాని బాలీవుడ్ బడా బ్యానర్ టి సిరీస్ లో నిర్మాణం వహిస్తుండగా ఇప్పుడు ప్రభాస్ నుంచి మరో ఊహించని గిఫ్ట్ రాబోతుందట. ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ప్రకటన మాత్రమే కాకుండా టైటిల్ కూడా రివీల్ కానుందట.

తాజా టాక్ ప్రకారం అయితే ఈ సినిమాకి “స్పిరిట్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని సందీప్ ఫిక్స్ చేశాడట. ఇక అది ఎంతవరకు నిజమో ఇంకొంత సమయం వేచి చూస్తే కన్ఫర్మ్ అయ్యిపోతుంది..