టాలీవుడ్ లో మరో ముల్టీస్టారర్ మూవీ

టాలీవుడ్ లో ఒకప్పుడు ముల్టీస్టారర్ సినిమాలు తరచూ వచ్చేవి. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు లాంటి స్టార్ హీరోలు కలిసి చాలా సినిమాల్లో నటించారు. కానీ చిరంజీవి జనరేషన్ టైం కి ముల్టీస్టారర్ లు తెలుగు లో మొత్తానికి కనుమరుగైపోయాయి.

అయితే దాదాపు రెండు దశాబ్డాల తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ఈ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. తాజాగా రాజమౌళి RRR సినిమాతో మళ్ళీ ఈ ట్రెండ్ ఊపందుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఇటీవలే ‘సీతారామం’ సినిమాతో హిట్ కొట్టిన హను రాఘవపూడి ముల్టీస్టారర్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా పీరియడ్ సినిమా అని తెలుస్తుంది. కానీ హీరో లు ఎవరనేది ఇంకా తెలియలేదు. ఇది హ‌ను డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిద‌ని తెలుస్తోంది. ఈ క‌థ చేయాల‌న్న ఆలోచ‌న హ‌నుకి ఎప్ప‌టి నుంచో ఉంది.

బ‌హుశా శ‌ర్వానంద్‌, నాని లాంటి  మిడ్ రేంజ్ హీరోలు ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇంకో నెల రోజుల్లో హ‌ను త‌దుప‌రి సినిమాపై పూర్తి క్లారిటీ వ‌చ్చేస్తుంది.