Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం బుల్లి రాజు పాత్ర పై భారీ విమర్శలు… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్?

Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కొడుకు బుల్లి రాజు పాత్రలో రేవంత్ అనే చిన్నారి నటించారు. అయితే ఈ చిన్నారి పాత్ర మాత్రం సినిమాకు మంచి హైలెట్ అయిందని చెప్పాలి.

ఈ సినిమాలో ఎక్కువగా ఓటీటీలు చూస్తూ కనిపించిన వారిపై బండ బూతులు తిడుతూ కనిపించే కుర్రాడి పాత్రలో నటించారు. థియేటర్లో సినిమా చూస్తున్నంత సేపు ఈ బుల్లి రాజు పాత్రను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఈ పాత్ర పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత చిన్నపిల్లాడితో అలా బండ బూతులు తిట్టిస్తూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ విమర్శలు చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి బుల్లి రాజు పాత్ర గురించి మాట్లాడారు. ఈ సినిమాకు బుల్లి రాజు పాత్ర హైలెట్ అయింది అని ప్రతి ఒక్క ప్రేక్షకుడి కూడా ఆ పాత్రను ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ సినిమా గురించి వస్తున్న విమర్శలు కూడా నా దృష్టికి వచ్చాయని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక నా స్నేహితులు కూడా కొంతమంది అంత చిన్న పిల్లాడి చేత అలాంటి బూతులు తిట్టించడం ఏంటి అని కూడా మాట్లాడారు.

ఈ సినిమాలో బుల్లి రాజు పాత్రను అలా క్రియేట్ చేయడానికి కూడా కారణం ఉందని తెలిపారు. మేము ఆ పాత్రతో చిన్న సందేశం ఇచ్చాం. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు ఓటీటీలో కంటెంట్ చూస్తే.. వాటికి ఎక్కువ అలవాటు పడితే ఎంత ప్రమాదం అన్నది చూపించాం. ఇంగ్లిష్, హిందీ వెబ్ సిరీస్‌లకు తెలుగు అనువాదాలు చూశారంటే దారుణమైన బూతులు ఉంటాయి. వాటిని విని తట్టుకోలేం. అలాంటివి పిల్లలు చూడకూడదన్న ఒక ఉద్దేశంతోనే ఈ పాత్ర చేయించామని తెలిపారు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పాలి అంటే సిగరెట్ తాగుతున్నట్టు చూయించాలి అంతమాత్రాన సిగరెట్ ప్రమోట్ చేసినట్టు కాదు. ఇది కూడా అంతే అంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.