కరోనా వైరస్ తెలుగు ఇండస్ట్రీలో చాపకింద నీరులా పాకిపోతోంది. సెలబ్రిటీలు, దర్శకులు ఒక్కొక్కరిగా వైరస్ బారినపడుతున్నారు. నిన్ననే పవన్ కళ్యాణ్ కు పాజిటివ్ రిపోర్ట్స్ రాగా తాజాగా మరొక స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడికి కూడ కరోనా సోకినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్రజెంట్ ‘ఎఫ్ 3’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే ఆయనకు వైరస్ సోకింది. కొన్నిరోజులుగా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఇటీవల పరీక్షలు చేయించుకున్నారని, పాజిటివ్ రావడంతో క్వారంటైన్లోకి వెళ్లారని తెలుస్తోంది.
దీంతో ‘ఎఫ్ 3’ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నెలలో సినిమా కొత్త షెడ్యూల్ మొదలుకావాల్సి ఉండగా ఇలా జరిగింది. ఇక అనిల్ రావిపూడి పూర్తిగా కోలుకున్న తర్వాతనే షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉంటే అనిల్ రావుపూడితో కలిస్ వర్క్ చేసిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు డైలమాలో పడ్డారు. వారు కూడ కరోనా పరీక్షలు చేయించుకున్నారట. అయితే వారి రిపోర్ట్స్ ఏంటి అనేది మాత్రం బయటకు రాలేదు.