ఏపీ టుడే : క‌రోనా కొత్త కేసులే కాదు, మ‌ర‌ణాలు కూడా..?

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,500 కరోనా పరీక్షలు నిర్వ‌హించ‌గా, కొత్తగా 4074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే క‌రోనా కార‌ణంగా ఒక్క‌రోజులోనే 54 మంది ప్రాణాలు కోల్పోగా, 1,335 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఏపీలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 53,724కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో కరోనా కార‌ణఃగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 696కి పెరిగింది. ఇవాళ 1,335 మందిని డిశ్చార్జి చేయగా, 24,228 మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం ఏపీలో ఇంకా 28,800 మంది క‌రోనా పేషెంట్లు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.