Mega Price : మెగా ప్రిన్స్‌తో అందాల రాక్షసి ఇంకోస్సారి.!

Mega Price : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒక్కటి కానున్నారు. అయ్యో పొరపాటు చేసుకునేరు. ఆన్ స్ర్కీన్ కోసం ఈ జంట ఒక్కటి కానుందండీ బాబు. అపార్డాలు చేసేసుకోకండి మీరు. అసలే వీళ్లిద్దరి మధ్యా లవ్వు పుకార్లు ఈ మధ్య తెగ షికార్లు చేసేస్తున్నాయ్.
ఇద్దరూ కలిసి గతంలో రెండు సినిమాల్లో నటించారు. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాలు అవి. అయితే, రెండూ ఫ్లాప్ సినిమాల లిస్టులోకే చేరతాయనుకోండి. ఎలాగైనా ఈ జంట హిట్ కొట్టాలనుకుంటోంది కాబోలు. మళ్లీ ఇంకోసారి జత కట్టడానికి సిద్ధమవుతోందట.
ఓ కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాడట. ఆ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్. కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య లవ్ ట్రాక్ గట్టిగా నడుస్తోందనీ, త్వరలోనే పెళ్లి కూడా చేసేసుకుంటారనీ, ఈ మధ్య సోషల్ కోడి గొంతెత్తి అరిచేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ ఆ కోడి కూతలు అలాగే వినిపిస్తున్నాయనుకోండి. అవేమీ పట్టించుకోకుండా, ఈ జంట స్ర్కీన్‌పై సందడి చేసేందుకు మరోసారి ముస్తాబవుతోందట. అయితే, ఈ సినిమాలో లావణ్యది ఫుల్ లెంగ్త్ రోల్ కాదనీ తెలుస్తోంది. కానీ, ఇంపార్టెంట్ రోల్ అట. చూడాలి మరి, అసలింతకీ ఆ ప్రాజెక్టు ఏంటో.? ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో.!
మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలో  ప్రేక్షకుల ముందుకు రానుంది.