కేటీఆర్ సర్.. గలగలా మాట్లాడే నా నోరు మూయించారు.. యాంకర్ సుమ ట్వీట్ వైరల్

anchor suma praises telangana minister ktr

యాంకర్ సుమ గురించి తెలుసు కదా. ఎదుటివాళ్లు ఎంతటివారైనా సరే.. వాళ్లను మాట్లాడనీయకుండా.. అన్నీ తనే మాట్లాడేస్తుంది. గలగలా ఎంతో స్పాంటెనిటీతో మాట్లాడేస్తుంది సుమ. అంత స్పాంటెనిటి ఉంది కాబట్టే తను యాంకర్ గా తెలుగు బుల్లి తెర మీద అగ్రస్థానంలో కొనసాగుతోంది.

anchor suma praises telangana minister ktr
anchor suma praises telangana minister ktr

తాజాగా సుమ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్వీట్ తో పాటు కేసీఆర్ ను సుమ ఇంటర్వ్యూ చేస్తున్న ఫోటోను ఆమె ట్వీట్ చేసింది.

కేటీఆర్ సర్ తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా నేను గలగలా మాట్లాడుతూ ఉంటాను. నా షోలలో వేరే వాళ్లను మాట్లాడనీయను. కానీ.. మీ నాయకత్వం నన్ను కట్టిపడేసింది. నేను ఏం మాట్లాడకుండా మీరు చెప్పేది వింటూ కూర్చున్నా. మీ అంకితభావం, అమలు చేసే విధానాలు సూపర్బ్ అంటూ సుమ ట్వీట్ చేసింది.

ట్వీట్ తో పాటు సుమ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కూడా చేసింది. ఇక.. సుమ ట్వీట్ కు రిప్లయి ఇచ్చేన కేటీఆర్.. మీతో మాట్లాడటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోను చూశాక ప్రజలు కూడా చాలా ఆనందిస్తారు అంటూ కేటీఆర్ రిప్లయి ఇచ్చారు.