యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఈ మధ్య చేస్తోన్న హల్చల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు బుల్లితెర, సినిమా ఈవెంట్లలో మాత్రమే సుమ చేసే రచ్చ మాత్రమే మనందరికీ తెలుసు. కానీ సుమ ఇంట్లో ఎలా ఉంటుంది.. బయట ఎలా ఉంటుందన్న సంగతి ఈ మధ్యే అందరికీ తెలుస్తోంది. ఈ కరోనా, లాక్డౌన్ వల్ల సుమ ఇంట్లో ఎలా ఉంటుంది? ఎలాంటి పనులు చేస్తుంది.. ఎంత సరదాగా ఉంటుందన్న విషయాలు సోషల్ మీడియా వల్ల అందరికీ తెలుస్తున్నాయి.
కరోనాపై అవగాహన కల్పించేందుకు ఎన్నో ఫన్నీ వీడియోలు చేసింది. మరీ ముఖ్యంగా మాస్క్‌లు ధరించడంపై నిత్యం ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ ఉంటుంది. ఎవరికో ఒకరికి మాస్క్ ధరించలేదని క్లాసులు పీకుతూనే ఉంటుది. ఆ మధ్య తన మేకప్ రూంలో ఒకతను మాస్క ధరించకపోతే వార్నింగ్ఇచ్చింది. లిఫ్ట్‌లో ఒకతను మాస్క్ ధరించకుండా కనిపిస్తే అక్కడా కూడా హెచ్చరించింది. ఇక తన అమ్మ కూడా మాస్క్ ధరించకపోయే సరికి కౌంటర్ వేసింది.
మళ్లీ తాజాగా మాస్క్ ధరించకపోవడంతో తన మేకప్ మేన్‌ను కౌంటర్ వేసింది. హేయ్ రమేష్.. మాస్క్ ఎందుకు ధరించలేదు అని సుమ అడిగింది. కొంచెం వేడిగా ఉందని మాస్క్ పెట్టుకోలేదు మేడమ్ అని బదులిచ్చాడు. వేడిగా ఉందా? అని సుమ వెరైటీగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. అయినా నేను హెల్దీగానే ఉన్నాను మేడమ్ అని మేకప్ మెన్ ఆన్సర్ ఇచ్చాడు. నుమ్ హెల్దీగానే ఉండొచ్చు కానీ పక్కవాళ్లకు ఉండొచ్చు కదా.. అయినా నువ్ హెల్దీగా ఉన్నా కూడా లక్షణాలు ఉండొచ్చు అని చెప్పుకొచ్చింది. వెంటనే మాస్క్ పెట్టుకో అని చెప్పింది. ప్రజలను కూడా మాస్క్ ధరించమని కోరింది.