Anasuys: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. న్యూస్ రీడర్గా మొదలైన ఈమె ప్రయాణం అనంతరం యాంకర్ గాను నటిగాను ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
వెండి తెరపై అనసూయకు సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో ఈమె బుల్లితెరకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర నుంచి దూరంగా ఉంటున్న అనసూయ ప్రస్తుతం వెండి తెరపై బిజీగా గడుపుతున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనుకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇక సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే పోస్టులు కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. ఈమె పొట్టి దుస్తులు వేసుకుంటూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు ఇక ఇటీవల ఏకంగా ఈమె బికనీలో కూడా కనిపించిన విషయం మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో తన గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి తనదైన స్టైల్ లోనే అనసూయ సమాధానం చెబుతూ ఉంటారు.
ఇదిలా ఉందిగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ఒకవేళ మీకు ఒక హీరోతో కనుక డేటింగ్ చేసే అవకాశం వస్తే ఏ హీరోతో డేటింగ్ చేస్తారూ అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ… నాకు కనుక పెళ్లి కాకపోయి ఉంటే తప్పనిసరిగా తాను మెగా హీరో రామ్ చరణ్ తో తప్పనిసరిగా డేటింగ్ చేసేదాన్ని అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.