భయపెడుతున్న అనసూయ..”పుష్ప” లో ఇదేం మాస్ గురూ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తీస్తున్న భారీ సినిమా “పుష్ప” చిత్రం ఎన్ని అంచనాలతో తెరకెక్కుతుందో తెలిసిందే. ఆల్ మోస్ట్ పూర్తి కావచ్చిన ఈ భారీ సినిమా నుంచి సుకుమార్ సిద్ధం చేసిన ఒక్కో లుక్ ని చూసి ప్రతీ ఒక్కరికీ మతి పోతుంది. మొన్ననే సునీల్ ని మునుపెన్నడూ చూడని లుక్ లో ప్రెజెంట్ చెయ్యగా ఇప్పుడు అనసూయ ని దాక్షాయణి గా చూపించారు.

రంగస్థలంలో గ్లామరస్ అత్త అయితే ఇక్కడ మాత్రం భయపెట్టే ఓ పెద్ద లా అనసూయ కనిపిస్తుంది. తన డ్రెస్సింగ్ మరియు లుక్ చూస్తే అసలు అనసూయ ని ఇలా ఎప్పుడైనా చూస్తామా అని డౌట్ కొడుతుంది. పూర్తిగా మాస్ లుక్ లో అనసూయ దర్శనం ఇచ్చింది. ఇంకా తన చేతిలో ఉన్న కట్టర్ చూస్తే తాను విలన్ రోల్ నే ఏమో అని ఫిక్స్ అయ్యిపోవచ్చు. మొత్తానికి మాత్రం అనసూయ నుంచి ఈసారి వేరే లెవెల్ మాస్ ని చూడొచ్చు..