మెగా ఫ్యాన్స్ కి ఊహించని భారీ ట్రీట్..ఏదో ప్లాన్ చేస్తున్నారట..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం కూడా మెగా మాట లేకుండా ఉండదు. మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన లెగసీ ని ఓ రేంజ్ లో నిలబెట్టి ఇప్పుడుకి కొనసాగిస్తున్నారు. ఇక సినిమాల పరంగా అయితే వసూళ్ళ పరంగా కానీ ఓ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అత్యధిక ఆదరణ ఉన్న హీరోలు కానీ మెగా కుటుంబం నుంచే ఉంటారు.

అందుకే మెగా ఫ్యామిలీ అంతా తమ ఫ్యాన్స్ కి రుణపడి ఉన్నాం అంటారు. అయితే ఈ మెగా ఫ్యామిలీ కి మెగా ఫ్యాన్స్ ఎంత బలమో వారి క్రేజ్ ఎంతో కోట్ల అభిమానులు మూలం గానే తెలుస్తోంది. మరి ఇప్పుడు మాస్ మూల విరాట్ మెగా స్టార్ బర్త్ డే వస్తుండడంతో ఓ మెగా భారీ ట్రీట్ ఫ్యాన్స్ కోసం వస్తున్నట్లు ఇప్పుడు ఓ టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఇది ఖచ్చితంగా మెగా ఫాన్స్ కి ఒక ఊహించని భారీ ట్రీట్ అని మెగా కాంపౌండ్ నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ భారీ అప్డేట్ ఏంటి? మెగా ఫ్యాన్స్ ని అంత ఆశ్చర్య పరుస్తుందా అనేవి మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి పలు సినిమా ల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. మరి వీటి నుంచి అయితే ఏమన్నా అప్డేట్స్ వస్తాయా లేక ఇది వేరే ప్లానా అనేది చూడాలి.