బాక్సాఫీస్ : అప్పుడే “యశోద”కి అదిరే వసూళ్లు.!

చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ నుంచే కాకుండా హీరోయిన్ సమంత నుంచి కూడా వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “యశోద”. ఇద్దరు దర్శకుడు హరి మరియు హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం సరోగసి స్కాం పై చాలా ఆసక్తిగా తెరకెక్కగా ఈ చిత్రంతో అయితే సమంత మళ్ళీ తన బాక్సాఫీస్ స్టామినా కూడా చూపించినట్టే అనిపిస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.

ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా యూఎస్ బాక్సాఫీస్ లో సాలిడ్ నంబర్స్ జస్ట్ ప్రీమియర్స్ తో మొదలు పెట్టినట్టు ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు. అయితే ఈ చిత్రం గత నెలన్నర రోజుల్లో రిలీజ్ అయ్యిన చిత్రాల్లో కన్నా బెటర్ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచినట్టు తెలుస్తుంది.

మరి ఈ చిత్రం అయితే జస్ట్ ప్రీమియర్స్ తోనే 60వేల డాలర్స్ కి పైగా వసూలు చేసింది. పైగా మరోపక్క పాజిటివ్ టాక్ కూడా బాగానే ఉంది కాబట్టి మొదటి రోజుతో కలిపితే డెఫినెట్ గా 1 లక్ష డాలర్స్ నమోదు అయ్యే ఛాన్స్ లు కూడా గట్టిగా ఉన్నాయి.

అంతే కాకుండా యూఎస్ టాప్ 10 చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటిగా ఇప్పుడు నిలిచింది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసారు.