Allu Arjun To Join Hands With SS Rajamouli : బన్నీ- రాజమౌళి కాంబినేషన్‌కి రంగం సిద్ధమైనట్లేనా.?

Allu Arjun To Join Hands With SS Rajamouli

Allu Arjun To Join Hands With SS Rajamouli : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి జక్కన్న తన మేకింగ్ టాలెంట్‌ని ప్రపంచానికి చూపించాడు. రాజమౌళితో సినిమా చేస్తే చాలు ప్యాన్ ఇండియా స్టార్లయిపోవడమే అని ప్రూవ్ చేశాడ జక్కన్న.అలా యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్యాన్ ఇండియా మార్కెట్‌పై పట్టు సాధించేశారు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో.

ఇక, ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది. ఆల్రెడీ బన్నీ ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అనిపించేసుకున్నాడు. ఇక, ఆ ఇమేజ్‌ని కొనసాగించాలంటే, రాజమౌళి వంటి డైరెక్టర్ చేతిలో పడాల్సిందే. అదే చర్చ నడుస్తోందిప్పుడు. బన్నీ, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందబోతోందట.

అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రతిష్టాత్మకంగా టేకప్ చేయబోతున్నాడట. ‘పుష్ప 2’ పూర్తి కాగానే, ఈ కాంబోకి రంగం సిద్ధం కానుందనీ తెలుస్తోంది. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, అనూహ్యంగా బన్నీ – రాజమౌళి కాంబినేషన్ హాట్ టాపిక్‌గా తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్‌పై భారీగా అంచనాలు మొదలైపోయాయ్.

ఈ కాంబినేషన్‌పై పెరిగిన హైప్ చూస్తుంటే , సీను రివర్స్ అయినా అయ్యేలా వుంది. అదేనండీ, మహేష్ బాబు వెనక్కి వెళ్లి, రాజమౌళి రేసులో బన్నీముందుకొచ్చేస్తాడేమో. ఏం చెప్పగలం. ఈ మధ్య మహేష్ బాబు అనుకున్న ప్రాజెక్టుల్ని, కమిట్ అయిన డైరెక్టర్లనీ సింపుల్‌గా పక్కన పెట్టేసి, సడెన్‌గా ట్రాక్ ఛేంజ్ చేసేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అయినా, అంతకు ముందు, ‘సరిలేరు నీకెవ్వరు..’ సినిమాల విషయంలోనూ అదే జరిగింది మరి.