Rowdy Boys: డేట్ నైట్ సాంగ్ రిలీజ్ చేసిన బన్నీ.. రౌడీ బాయ్స్ పై ఐకాన్ స్టార్ ప్రశంసలు!

Rowdy Boys: సంక్రాంతి సందర్భంగా ఎన్నో తెలుగు సినిమాలు థియేటర్ల వద్ద తలపడనున్నాయి . శ్రీ వెంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’ . ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు , శిరీష్ కలసి ఎన్నో చిత్రాలను నిర్మించారు . రౌడీ బాయ్స్ ద్వారా శిరీష్ కుటుంబం నుండి ఆశిష్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతున్నాడు.సోమ‌వారం ఈ సినిమా నుంచి “డేట్ నైట్” సాంగ్‌ను విడుద‌ల  చేయటానికి చిత్ర బృందం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది . ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు .

ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై” డేట్ నైట్”రిలీజ్ చేశారు . ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ కార్యక్రమం నాకెంతో స్వీట్.. ఆర్య సినిమా నా జీవితంలో ఇంత ముఖ్యమైనది.. దిల్ రాజు గారు సుకుమార్ గారు లేకపోతే నా జీవితంలో ఆర్య సినిమా ఉండేది కాదు . ఆర్య సినిమా షూటింగ్ సమయంలో ఆశిష్ కు 7 సంవత్సరాలు . ఆశిష్ ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడని అప్పుడు అనుకోలేదు . ఆశిష్ ని ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది . ఈ ఫంక్షన్ కి రావటం అనేది ఈ సినిమాకు నేను చేస్తున్న ఫెవర్ కాదు ..అది నా బాధ్యత. డేట్ నైట్ సాంగ్ చాలా బాగుంది . ఆశిష్ చాలా బాగా డాన్స్ చేశాడు . రౌడీ బాయ్స్ హోల్ టీం కి నా అభినందనలు. ఆల్ ది బెస్ట్ అంటూ ఈ కార్యక్రమంలో బన్నీ మాట్లాడారు .

ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న టాలీవుడ్ సినిమాలు అన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి . తాజాగా రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . శ్యామ్ సింగరాయ్ సినిమా చాలా బాగుంది.. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ టీంకు నా అభినందనలు . ఇప్పటివరకు నాకు ఆ టీమ్‌కు అభినందనలు తెలపడానికి అవకాశం దొరకలేదు అంటూ బన్నీ చెప్పుకొచ్చారు .