ది వారియర్ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… అదే కారణమా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా నటించిన సినిమా ది వారియర్. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని జూలై 14 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ది వారియర్ సినిమా స్టోరీని లింగుస్వామి రామ్ పోతినేని కన్నా ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వినిపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా లింగుస్వామి బన్నీతో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపించాయి.

అప్పుడు ఈ సినిమా కథ గురించి వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని ఇప్పుడు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అందుకు కారణం అప్పటికే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత పుష్ప 2 కూడా రానుంది. పుష్ప 2 పూర్తయిన తర్వాత బోయపాటితో ఒక సినిమా త్రివిక్రమ్ తో ఒక సినిమా బన్నీ కమిట్ అయ్యాడు. దాంతో బన్నీ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. అందువల్ల లింగుస్వామి ఈ కథ కోసం రామ్ పోతినేనితో ఈ సినిమా తీశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ది వారియర్ సినిమా జులై 14 విడుదల కానుండటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రామ్, కృతి శెట్టి పలు ఇంటర్వ్యులలో పాల్గొంటూ ఆసక్తికర విషయాల చెళ్ళదిస్తున్నారు. ఇటీవల కూడా వీరిద్దరూ కలసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా లో రామ్ పవర్ ఫుల్ డి.ఎస్.పి పాత్రలో కనిపించనున్నాడు. ఇక కృతి శెట్టి కూడా రేడియో జాకీగా ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రెడ్ సినిమాతో ప్లాప్ అందుకున్న రామ్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.