అల్లు అర్జున్ @ 50 కోట్లు.. తగ్గేదేలా..

Allu Arjun charging 50 crore for Pushpa
Allu Arjun charging 50 crore for Pushpa
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో ఆయన మార్కెట్ రేంజ్ దాదాపు 40 శాతం పెరిగింది.  ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.  ఎన్నో కథలు విన్న అల్లు అర్జున్ చివరకు సుకుమార్ ‘పుష్ప’కు ఓకే చెప్పారు.  ఈ సినిమాను ఇప్పుడంటే రెండు భాగాలు చేయాలని డిసైడ్ అయ్యారు కానీ మొదట్లో ఒక్క పార్ట్ అనే అనుకున్నారు. ఈ చిత్రానికిగాను బన్నీ 30 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకునేట్టు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాను రెండు పార్ట్శ్ చేయాలని సంకల్పించారు. సుకుమార్ అందుకు తగ్గట్టు కథలో మార్పులు చేశారు. 
 
కథను విస్తరించి రెండవ భాగానికి సరిపడా స్టఫ్ రెడీ చేశారు.  దీంతో అల్లు అర్జున్ కొత్తగా మరొక సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది.  అందుకే రెమ్యునరేషన్ కూడ పెంచారు.  రెండవ భాగానికి అదనంగా ఇంకో 20 కోట్లు పుచ్చుకుంటున్నారట ఆయన. అంటే రెండు భాగాలకు కలిపి 50 కోట్ల పారితోషకం. ఈ మొత్తం ఇంకా ఎక్కువే ఇండొచ్చనే టాక్ కూడ ఉంది. ఈ పాన్ ఇండియా సినిమా గనుక విజయం సాదిస్తే అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 40 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి బన్నీ కెరీర్ ‘పుష్ప’ సినిమాతో కొత్త టర్న్ తీసుకునేలా కనబడుతోంది. ఇంకొక విశేషమేమిటంటే అల్లు అర్జున్ ముందు ముందు చేయబోయేవన్నీ పాన్ ఇండియా సినిమాలే.