గీతాఆర్ట్స్‏లో ‘గీతా’ ఎవరో చెప్పిన అల్లు అరవింద్

తెలుగు లో ఉన్న అతి కొద్ది సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకడు. సురేష్ ప్రొడక్షన్ లాంటి దిగ్గజ ప్రొడక్షన్ హౌస్ ఇప్పటి సినిమా మేకింగ్ ని, బడ్జెట్ ని తట్టుకోలేక సినిమాలు తియ్యడం తగ్గించేసిన అల్లు అరవింద్ మాత్రం అప్పుడప్పుడు సూపర్ హిట్ సినిమాలు అందిస్తూనే ఉన్నాడు. ఈ మధ్య తెలుగు లో తాను రిలీజ్ చేసిన ‘కాంతారా’ కూడా సూపర్ హిట్ అయ్యింది.

అల్లు ఫ్యామిలీలో ‘గీతా’ అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరు. కానీ నిర్మాణ సంస్థకు మాత్రం గీతా అనే పేరు ఉండడంతో అసలు ఎవరు ఈ గీతా అనే సందేహాలను చాలా కాలంగా జనాల్లో ఉండిపోయాయి. దీని పై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు.

తండ్రి అల్లు రామలింగయ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “ఒకసారి మా అమ్మా నాన్నల మధ్య గొడవ జరిగింది. మా నాన్న అలిగి చెప్పులు కూడా వేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నేను కారు వేసుకొని వెళ్లి వెతికి తీసుకు వచ్చా. ఇంటి దగ్గర కారు ఆపుతుంటే బ్రేక్ కొంచెం ఫాస్ట్ గా వేశా. ఆయన నన్ను ఒక దెబ్బ కొట్టి ఎవర్రా నీకు డ్రైవింగ్ నేర్పింది” అని అరిచారు. నాకు అప్పుడు 45 ఏళ్ళు ఉంటాయి. ఆయన చెంప దెబ్బ కొట్టినప్పుడు ఎవరైనా చూసారేమోనని కంగారుపడ్డా. కారు దిగి బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న. రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ మాట్లాడుతూ.. ‘ఎందుకండీ మావయ్య గారు మిమ్మల్ని కొట్టారు’ అని అడిగింది. “ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. మా నాన్న నన్ను కొట్టడం బాల్కనీ నుంచి చూసి వెంటనే లోపలికి పరుగుతీసిందట. ఆ సంఘటన నా జీవితంలో ఓ తీపిగుర్తు. మా పిల్లలతో మాత్రం చాలా కలిసిపోయే వాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా “గీతా ఆర్ట్ అనే పేరు పెట్టింది మా నాన్న. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. ప్రయత్నం మాత్రమే మనది. ఫలితం మన చేతిలో ఉండదు. ఇది సినిమాలకు బాగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే కానీ, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అని గీతా పేరు పెట్టారు. గీత పేరు మీద తీసిన సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీ ఆడాయి. అందుకే మార్చాలన్న ఆలోచన మాకు రాలేదు. మరో విషయం ఏమిటంటే నేను చదువుకునే రోజుల్లో నాకు గీత అని గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నా స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారు” అని అల్లు అరవింద్ ఆ సంస్థ కి ఆ పేరు పెట్టడం వెనుక రీసన్ చెప్పాడు.