కొత్త లుక్ తో  షాక్ ఇచ్చిన అల్లరి నరేష్

అల్లరి నరేష్ అంటే కొన్నాళ్ల క్రితం వరకు మినిమం గారంటీ హీరో. సంవత్సరంలో కనీసం నాలుగు సినిమాలు చేసేవాడు నరేష్. ‘అల్లరి’ సినిమా తో హీరో గా పరిచయమైన నరేష్ ఆ తర్వాత ‘కత్తి కాంత రావు’, ‘దొంగల బండి’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్’ లాంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గమ్యం’ సినిమా అయితే నరేష్ కెరీర్ లో హైలైట్. తాను గాలి శీను పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. నరేష్ తప్ప ఇంకెవ్వరు ఈ రోల్ ని చెయ్యలేరు అనే లా ఆ రోల్ లో జీవించాడు.

అయితే…’జబర్దస్త్’ లాంటి టీవీ షో లు రావడం, స్టార్ హీరో లు కూడా సినిమాల్లో కామెడీ చెయ్యడం వల్ల నరేష్ కామెడీ అంత గా అలరించేది కాదు. దీంతో వరుస ప్లాప్ ల తో కెరీర్ ఒక్కసారి గా డల్ అయిపోయింది.

కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని నరేష్ సీరియస్ రోల్స్ వైపు మల్లడు. మహేష్ బాబు ఫ్రెండ్ గా ‘మహర్షి’ సినిమా లో మెప్పించాడు. ఆ తర్వాత ‘నాంది’ అనే సినిమాలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

‘నాంది’ సినిమా విజయం తర్వాత అల్లరి నరేష్ -విజయ్ కనకమేడల కాంబినేషన్ లో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఉగ్రం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లరి నరేష్ రక్తపు మరకలతో షాకింగ్ లుక్ లో కనిపించాడు. పైగా వీపు వెనుక గుచ్చుకున్న కత్తితో నిజంగానే ఉగ్ర రూపంలో నరేష్ లుక్ ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటేనే.. ఈ చిత్రం పూర్తి వైల్డ్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది.

ఈ సినిమా కూడా తప్పక హిట్ సాదిస్తుందని టీం గట్టి నమ్మకంతో ఉంది. ఈ సినిమా పై మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది.