హీరోయిన్ల కోసం అలా చేసేవారా?.. అల్లరి నరేష్ కామెంట్స్ వైరల్

Allari naresh

పొట్టిగా హీరోలు ఉండి.. పొడుగ్గా ఉండే హీరోయిన్లు ఉన్నా, పొడుగ్గా ఉన్న హీరోలు ఉండి.. పొట్టిగా ఉన్న హీరోయిన్లు వచ్చినా సమస్యలు మొదలవుతుంటాయి. ముఖ్యంగా ఈడు జోడు బాగుందనిపించేలా జంటలను వెతకడం దర్శకనిర్మాతలకు కత్తి మీద సామే అవుతుంది. అయితే అల్లరి నరేష్ ప్రస్తుతం నాంది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్‌గా జరిగింది.

నాంది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లరి నరేష్ మాట్లాడుతూ అసలు విషయం బయటకు చెప్పేశాడు. నాంది సినిమాలోని హీరోయిన్ నవమి గురించి మాట్లాడుతూ తన పాత హీరోయిన్లపై కామెంట్ చేశాడు. నవమి వల్ల నిర్మాతకు ఖర్చు తగ్గిందట. ఖర్చు తగ్గడం అటుంచితే అల్లరి నరేష్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మామూలుగా అయితే అల్లరి నరేష్ హైట్ చాలా ఎక్కువే. ఆయన పక్కన నటించే హీరోయిన్లను పట్టుకురావడం కాస్త కష్టమే. అయితే అల్లరి నరేష్ హీరోయిన్లకు సినిమాల్లో యాపిల్ బాక్సులను పెడతారు. వాటి మీద హీరోయిన్లను నిల్చోబెట్టి షూటింగ్‌లు కానిస్తారట. కానీ నాంది సినిమాలో నవమి వల్ల ఆ యాపిల్ బాక్సులను వాడాల్సిన అవసరం రాలేదంటా.. తద్వారా నిర్మాతకు కాస్త ఖర్చు తగ్గిందని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.