అక్టోబ‌ర్ 8న ఆర్ఆర్ఆర్ రిలీజ్.. సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించిన ఇంగ్లీష్ నటి!

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న రాజమౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా జ‌క్క‌న్న ఈ సినిమాని చెక్కుతున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అలియా భ‌ట్, అజ‌య్ దేవ‌గణ్ న‌టిస్తున్నారు. ఇంగ్లీష్ న‌టీమ‌ణులు ఒలీవియో మోరిస్, అలిస‌న్ డూడి కూడా చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే అలిసన్ డూడి ఈ సినిమాలో లేడీ స్కాట్ గా నటిస్తోండగా, ఇప్పుడు ఈమె క్లైమాక్స్ సన్నివేశాల‌లో పాల్గొనేందుకు సిద్ద‌మైంది.

అయితే తాను క్లైమాక్స్ షూట్ లో పాల్గొనే విష‌యాన్ని తెలియ‌జేసే క్ర‌మంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అక్టోబ‌ర్ 8 అని ప్ర‌క‌టించింది. జ‌రిగిన త‌ప్పుని గ్ర‌హించిన ఆమె వెంట‌నే ఆ పోస్ట్ తొల‌గించింది. అలిసన్ చేసిన పోస్ట్‌తో అభిమానుల‌లో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ 8న రిలీజ్ అవుతుందా లేదంటే గ‌త ఏడాది అనౌన్స్ చేసిన డేట్‌ని మ‌రిచిపోయి ఇప్పుడు ఇలా రాసుకొచ్చిందా అంటూ నెటిజ‌న్స్ ముచ్చటిస్తున్నారు. వ‌చ్చే నెలాఖ‌రు వ‌ర‌కు దాదాపు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ని పూర్తి చేయాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా, ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు వేగ‌వంతం చేసి స‌మ్మ‌ర్‌లో మూవీని రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు.

క‌రోనా వ‌ల‌న ఆగిపోయిన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. గ‌జ‌గ‌జ వ‌ణికే చ‌లిలోను చిత్ర బృందం షూటింగ్ జ‌రిపారు. ఈ సినిమాతో బాహుబ‌లి రికార్డులు కూడా తిర‌గ‌రాయాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తుండ‌గా, ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు విడుద‌ల చేస్తారా అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రియా శరన్‌, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్‌, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిపంచనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.