Alia Bhatt: బాలీవుడ్ ప్రేమపక్షులు అలియా భట్, రణ్బీర్ కపూర్ లు గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట ఎప్పుడు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటుందా అని సిని ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ఎక్కడికి వెళ్ళినా కూడా వారి పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అలియా భట్ కు మరొకసారి ఇదే ప్రశ్న ఎదురయింది.
ఇదిలా ఉంటే అలియాభట్ తాజాగా నటించిన చిత్రం గంగుబాయి కతియావాడి ఈ సినిమా నేడు విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అలియా భట్ ను కొందరు నీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన ఆలియాభట్.. ఎవరు చూసినా నీ పెళ్లి ఎప్పుడు అని పదేపదే అడుగుతున్నారు.. దీని గురించి రెండు విషయాలు చెప్పాలి.. మొదటిది ఎవరికి సంబంధించినది కాదు.. అది నా వ్యక్తిగతం.. ఇక రెండవది ఏంటంటే పెళ్లి అనేది మనసుకు సంబంధించినది.
రిలేషన్ షిప్ లో ప్రశాంతంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. మా ఇద్దరి ఇష్టాలకు అనుగుణంగా ఇప్పుడు పెళ్లి జరగాలి అంటే అప్పుడు జరుగుతుంది. నిజం చెప్పాలి అంటే రణ్బీర్ తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది అని తెలిపింది అలియా భట్. నా చిన్నతనంలోనే రణ్బీర్ ను మొదటిసారి స్క్రీన్ పై చూసినప్పుడే పెళ్లి చేసుకోవాలి అనిపించింది అని తెలిపింది.