Sumanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా,అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఒకానొక సమయంలో ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అదేవిధంగా సుమంత్ నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కీర్తి రెడ్డి సుమంత్ మధ్య మనస్పర్ధలు రావడం చేత వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులతో విడిపోయిన ఈ జంటలో కీర్తి రెడ్డి మరొక వివాహం చేసుకొని భర్త పిల్లలతో సంతోషంగా గడపగా సుమంత్ మాత్రం ఒంటరిగానే ఉన్నారు.
ఇకపోతే సుమంత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదలైంది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా ఈనెల 11వ తేదీన జీ 5 స్టూడియో ద్వారా విడుదల చేయడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సుమంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన విడాకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ మళ్ళీ మొదలైంది సినిమా కథ విడాకుల నేపథ్యంలో తెరకెక్కతుందని చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించాలని భావించినట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాని వదులుకోకూడదని ఫిక్స్ అయినట్లు తెలిపారు.అయితే ప్రస్తుత కాలంలో విడాకులు అనేవి చాలా కామన్ అయ్యాయని మా కుటుంబంలో కూడా ఇలా విడాకులు తీసుకున్న వారు చాలామంది ఉన్నారని ఈ సందర్భంగా సుమంత్ తెలియజేశారు.ఇలా విడాకులు అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న వారు ఆ పెళ్ళిలో కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తిన విడిపోకుండా అలాగే సర్దుకుపోతున్నారు. రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా విడిపోతే వారికంటూ ఓ ముద్ర ఏర్పడుతుందని అందుకే సర్దుకుపోతున్నారు అంటూ సుమంత్ తెలియజేశారు.