నిన్న మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫొటో ర‌చ్చ చేస్తే.. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ ఫొటో అద‌ర‌గొడుతుంది!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కొన్ని ఫ్యామిలీల హ‌వా న‌డుస్తుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ద‌గ్గుబాటి ఫ్యామిలీ, ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీలు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌మ స‌త్తా చూపుతుంటాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే ఇందులో హీరోల‌తో ఓ క్రికెట్ టీంనే తయారు చేయ‌వ‌చ్చు కామెంట్స్ వినిపించాయి. అయిన‌ప్ప‌టికి ఆ కుటుంబం నుండి హీరోలు పుట్టుకొస్తూనే ఉన్నారు. మొన్న‌టికి మొన్న శ్రీజ‌ని వివాహం చేసుకున్న క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అయితే ఇప్పుడు నిహారిక భ‌ర్త చైత‌న్య కూడా త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.

విశ్వ‌వ్యాప్తంగా క్రిస్మ‌స్ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. హిందువులు సైతం ఈ వేడుక‌ల‌ని జ‌రుపుకున్నారు. ముఖ్యంగా మ‌న సెల‌బ్రిటీలు కొంద‌రు సాంటా లుక్ లోకి మారి విషెస్ తెలియ‌జేయ‌గా, ఇంకొంద‌రు ఫ్యామిలీతో క‌లిసి వేడుక జ‌రుపుకున్నారు. ఈ సారి క్రిస్మ‌స్ వేడుక కోసం రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు మెగా ఫ్యామిలీ అంద‌రిని ఇన్వైట్ చేయ‌గా,ఆ కార్య‌క్ర‌మంలో మెగా ఫ్యామిలీ అంతా క‌లిసి దిగిన ఫొటో సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫొటో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా అక్కినేని ఫ్యామిలీ అంతా ఓ చోట చేరారు. నాగార్జున నుండి అఖిల్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఈ గ్రూప్ ఫొటోలు ఉన్నారు. చాలా రోజుల త‌ర్వాత అక్కినేని గ్యాంగ్ అంతా ఓ ఫ్రేములో క‌నిపించే స‌రికి వారి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ గ్రూప్ ఫొటోలో నాగ చైత‌న్య‌, స‌మంత‌, సుశాంత్, సుమంత్‌తో పాటు వారి కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు.