బిగ్ అప్డేట్ : భారీ పోటీకి సిద్ధం అయ్యిన అఖిల్ “ఏజెంట్” చిత్రం.!

టాలీవుడ్ నుంచి వస్తున్న పలు పాన్ ఇండియా చిత్రాల్లో ఎన్నో అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో యంగ్ హీరో అఖిల్ అక్కినేని చేస్తున్న అచిరే ప్రాజెక్ట్ “ఏజెంట్” కూడా ఒకటి. దీనిని అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా ఎప్పుడు నుంచి మంచి అంచనాలు ఈ సినిమా మీద అయితే ఉన్నాయి.

ఇక ఈ చిత్రం అయితే రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఈరోజు దీపావళి కానుకగా అయితే చిత్ర యూనిట్ ఆ మాసివ్ అప్డేట్ ని రివీల్ చేసారు. ఈ చిత్రాన్ని కూడా చిత్ర యూనిట్ జనవరి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

మరి ఈ సంక్రాంతిలో అయితే ఆల్రెడీ భారీ పోటీ ఉంది. విజయ్ వారసుడు, బాలయ్య వీరసింహా రెడ్డి ఈరోజు టైటిల్ రివీల్ అయ్యిన మెగాస్టార్ చిత్రం వాల్తేరు వీరయ్య అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లాంటి మహా సినిమాలు ఉన్నాయి.

మరి ఇలాంటి భారీ సినిమాలతో పోటీ అయితే పెద్ద సాహసమే అని చెప్పాలి. మరి ఇప్పుడు అయినా ఈ చిత్రం రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో అయితే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అనిల్ సుంకర సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.