Akhil Akkineni: ఆ స్టార్ హీరోయిన్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్న అఖిల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Akhil Akkineni: టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అఖిల్ ఎప్పటినుంచో సరైన హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చాలా సమయం తీసుకుని మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ అఖిల్ కు మాత్రం సరైన సక్సెస్ సినిమా పడడం లేదు. ఇకపోతే అఖిల్ చివరగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీగానే కష్టపడ్డారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా దారుణమైన ఫలితాలను చవి చూసింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా కాస్త ఫ్లాప్ అవడంతో అఖిల్ మళ్ళీ ఏ సినిమా చేయలేదు. ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైఒక సినిమాకి ఓకే చేసాడు అఖిల్. కాగా ఈ సినిమాకి కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తీసిన మురళీ కిషోర్ అబ్బోరు దర్శకత్వం వహించనున్నారట. ఇక ఇందులో అఖిల్ కి జోడీగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే అఖిల్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇటీవలే అఖిల్ జైనబ్ రావడ్జితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అన్న నాగచైతన్య పెళ్లికి కొద్దిరోజుల ముందే అఖిల్ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలో వీరి వివాహం జరగనుంది అంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.