‘ఏజెంట్ ‘ స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో పాటు చిందులేయనున్న చిట్టి?

హీరో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుండి ప్రేక్షకులలో అఖిల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఊహ తెలియని వయసులో సిసింద్రీ సినిమాలో కనిపించిన అఖిల్ తర్వాత మనం సినిమా క్లైమాక్స్ లో కనిపిస్తాడు. ఇక వివి వినాయక దర్శకత్వం వహించిన అఖిల్ సినిమా ద్వారా మొదటిసారిగా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా అఖిల్ మొదటిసారి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు ఎక్కుతున్న ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా సాక్షీ వైద్య నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలోని స్పెషల్ సాంగ్ తప్పకుండా ఉంటుంది. స్క్రిప్టులో చోటు లేకపోయినా, స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ ఐటెం సాంగ్స్‌ని పెడుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఎంతోమంది భామల్ని పరిశీలించారు.

అయితే మొత్తనికి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం జాతి రత్నాల హీరోయిన్ ఫరియ అబ్దుల్లా ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదివరకే నాగార్జున, నాగచైతన్య తో కలిసి బంగార్రాజు సినిమాలో స్టెప్పులేసిన ఈ అమ్మడు ఇప్పుడు అఖిల్ తో కలిసి చిందులేయనుంది. అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అఖిల్ ఈ సినిమా కోసం భారీగా కసరత్తులు చేసి కండలు పెంచాడు. ఈ సినిమాలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్రలో మలయాళీ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు