Akhanda Box Office Report : బాక్సాఫీస్ రిపోర్ట్ : రికార్డు వసూళ్లతో విదేశీ గడ్డపై “అఖండ” గర్జన!

Akhanda Box Office Report : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అలాగే ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన టాలీవుడ్ చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “అఖండ” కూడా ఇప్పుడు నిలిచింది అని చెప్పాలి.

బాలయ్య చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా విడుదల కాబడిన ప్రతి చోట సాలిడ్ రెస్పాన్స్ అందుకొని భారీ లాభాలను తెచ్చి పెట్టింది. అయితే విదేశీ గడ్డ అయినటువంటి యూ ఎస్ ఏ బాక్సాఫీస్ దగ్గర అఖండ బంపర్ విజయం ఓ రేంజ్ లో నమోదు అయ్యిందని చెప్పాలి.

ప్రీమియర్ డేట్ నుంచే హాఫ్ మిలియన్ వసూళ్లు కొల్లగొట్టేసిన అఖండ ఇప్పుడు రికార్డు వసూళ్ల మార్క్ ని నమోదు చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మొన్న వీకెండ్ ఆదివారంతో ఈ చిత్రం 50 వేల డాలర్లు వసూలు చేసిన 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసి పుష్ప సినిమా రిలీజ్ వరకు హవా కొనసాగించనుంది.

మన కరెన్సీ ప్రకారం 7.5 కోట్లు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రిపోర్ట్ చేసి ఈ ఏడాది ఇంకో క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.