తమ తల్లిదండ్రుల విడాకులపై పూర్తి క్లారిటీ ఇచ్చిన ఆకాష్ పూరి..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ప్రస్తుతం చోర్ బజార్ సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ పూరి పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు. అంతేకాకుండా తన తల్లితండ్రుల విడాకుల గురించి కూడా కూడా స్పందించాడు.

గత కొన్ని రోజుల నుంచి పూరి జగన్నాథ్ తన భార్య లావణ్యతో విడిపోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం గురించి ఆకాశ్ స్పందిస్తూ.. తమ తల్లిదండ్రులది ప్యూర్ లవ్ అని.. అలాంటిది తాము విడిపోతున్న వార్తలు వచ్చినట్లు తనకు కూడా తెలియదని.. అవన్నీ అవాస్తవాలు అంటూ.. తాము ఎంతో సంతోషంగా ఉన్నాము అని.. ఏం చేయాలో తెలియక కొంత మంది ఇలాంటి వార్తలు సృష్టించినట్లు ఉన్నారని అన్నారు.