అక్కినేని ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ?? ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.!

ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి అయితే అటు నాగ్ నుంచి అక్కినేని నాగ చైతన్య వరకు మంచి హిట్స్ తో అదిరే కం బ్యాక్ లను అందుకున్నారు. అయితే వీరితో పాటుగా తన కెరీర్ లో భారీ హిట్ ని అఖిల్ కూడా తన మూడో సినిమాతో అందుకొని నెక్స్ట్ పాన్ ఇండియా మార్కెట్ పై తాను కన్నేశాడు. 

దర్శకుడు సురేందర్ రెడ్డితో భారీ చిత్రం “ఏజెంట్” ని తాను చేస్తున్నాడు. భయారే ఏక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా విషయంలో మాత్రం గత కొన్నాళ్ల నుంచి అక్కినేని ఫ్యాన్స్ కి ఏదొక షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతూనే ఉంది. షూటింగ్ విషయంలో రిలీజ్ విషయంలో అలా ఏదొక అంశం ఫ్యాన్స్ కి షాకింగ్ గా వినిపిస్తుంది. 

ఇక ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ కి రిలీజ్ విషయంలో నిరాశ తప్పేలా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ సినిమాలో కీలక పార్ట్ ఇంకా బ్యాలన్స్ ఉండడం వల్ల సినిమా అయితే అనుకున్నట్టుగా ఆగష్టు లో రిలీజ్ అయ్యేలా లేదని సెప్టెంబర్ కి వాయిదా పడిపోయింది అని వినిపిస్తుంది. 

మరి దీనిపై అయితే ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. అలాగే అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.