Bollywood Heroine : షాకింగ్ : ఈ హాట్ బ్యూటీ తర్వాత మరో బాలీవుడ్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్.!

Bollywood Heroine :  మళ్ళీ కరోనా తీవ్రత ఎలా పెరుగుతుందో చూస్తున్నాం. ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా ఇప్పుడు రోజురోజుకి కేసులు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో పలువురి సినీ తారలకు కూడా కరోనా పాజిటివ్ వస్తుండడంతో మరింత కలకలం రేగింది.

ఆల్రెడీ టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలు మంచు మనోజ్ మరియు నిన్న విశ్వక్ సేన్ లు పాజిటివ్ గా తేలగా బాలీవుడ్ స్టార్స్ లో కూడా కరోనా తీవ్రత కనబరుస్తుంది. జస్ట్ మొన్ననే బాలీవుడ్ వెరీ హాట్ బ్యూటీ నోరా ఫతేహి కి కరోనా సోకగా ఆమె ఇప్పుడు ఐసోలేషన్ లో ఉంది.

ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి కరోనా సోకినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె మరెవరో కాదు మన హిట్ సినిమా “జెర్సీ” ని రీమేక్ హిందీలో చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అట. అయితే ఈమెకి మళ్ళీ ఫ్రెష్ ఒమిక్రాన్ వేరియంట్ సోకిందట.

దీనితో ఈమె కూడా ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుందట. ఆల్రెడీ ఈమె సినిమా బాలీవుడ్ లో కరోనా వల్లనే రిలీజ్ కి నోచుకోలేకపోయింది. మరి ఫైనల్ గా ఏమవుతుందో ఏంటో..