Raj Tharun : ఓటీటీ వైపు చూస్తోన్న ఆ యంగ్ హీరో.. వెండితెరపై ఫ్లాప్ అవడమే కారణమా.?

Raj Tharun :  ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన కుర్రోడు రాజ్ తరుణ్. నిజానికి డైరెక్టర్ అవ్వాలనుకుని, హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో హీరోగా తొలి సినిమా నుంచీ జోరు చూపించాడు. వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు.
జూనియర్ మాస్ రాజా అంటూ రాజ్ తరుణ్‌‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెగ మెచ్చేసుకున్నారంతా. కానీ, ఆ తర్వాత సీను రివర్స్ అయ్యింది. మాస్ రాజా సీరియస్ అయిపోయాడు. రాజ్ తరుణ్‌లో ఫ్యాన్స్ మెచ్చుకొనేదే ఆయనలోని జోష్, గ్రేస్. అది కోల్పోయాడు రాజ్ తరుణ్.
నెక్స్‌ట్ మూవీ, ఆ పై నెక్స్‌ట్ మూవీ.. అంటూ రాజ్ తరుణ్ నుంచి వచ్చిన సినిమాల్లో కామెడీ కోసం వెతికారు ఫ్యాన్స్. కానీ, వరుసగా వరుస వరుసగా డిజప్పాయింట్ చేస్తూనే వచ్చాడు రాజ్ తరుణ్.
ఇక జనాల్లో ఓపిక నశించిపోయింది. కామెడీ హీరో, మినిమమ్ గ్యారంటీ హీరో అన్న ఇమేజ్‌కి పూర్తిగా టాటా బైబై చెప్పేశాడు రాజ్ తరుణ్.
రాజ్ తరుణ్ నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో, ఎప్పుడెళ్లిపోయాయో కూడా తెలీయకుండా పోయింది. లేటెస్టుగా రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’ సినిమాదీ అదే పరిస్థితి. ఇక రాజ్ తరుణ్ మేల్కొన్నాడు. పెద్ద తెరపై ఇక వల్ల కాదనుకున్నాడో ఏమో, ఓటీటీ తెరపై సందడి మొదలెట్టాడు.
ఓటీటీలో ‘అహ నా పెళ్లంట’ అనే ఓ వెబ్ సిరీస్‌లో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఫుల్ ఆఫ్ ఫన్, ఆధ్యంతం నవ్వులు పూయించబోతోందట ఈ వెబ్ సిరీస్. ఏళ్ల తరబడి పెళ్లి కోసం ఎదురు చూసే హీరోకి ఎట్టకేలకు పెళ్లి అవుతుండగా, ఆ పెళ్లి కూతురు, పీటల మీంచి లేచిపోతుందట.. ఈ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట.
30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్లుగా ప్రసారం కానుందట ఈ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌తోనైనా రాజ్ తరుణ్ మునుపటి వైభోగాన్ని తెచ్చుకుంటాడేమో చూడాలి మరి.