Star Heroine Ready To Give Shock : సామ్ తర్వాత విలన్ గా మారిన గ్లామరస్ స్టార్ హీరోయిన్..షాకిస్తుందట.!

Star Heroine Ready To Give Shock

Star Heroine Ready To Give Shock :  జెనరల్ గా మంచి స్టార్ స్టేటస్ లో ఉన్న హీరోలు విలన్స్ గా మారిన సందర్భాలు అలాగే విలన్స్ హీరోలుగా మారిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే మగవారి పాత్రలు ఇలా వేరియేషన్స్ లో మారగా హీరోయిన్ గా చేసే నటీమణులు మాత్రం హీరోయిన్స్ గానే మిగిలిపోతున్నారు. ఇదే దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఇండియన్ సినిమా దగ్గర నడుస్తున్న ఫార్మాట్.

అయితే విలన్స్ ఓ స్టార్ హీరోయిన్ ఎప్పుడు మారుతుంది అంటే వారికి బాగా వయసయ్యాకో లేక మధ్య వయసు లోకి వచ్చాకో మారుతుంది. కానీ లేటెస్ట్ గా టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న గ్లామరస్ అండ్ యంగ్ స్టార్ బ్యూటీ రాశీ ఖన్నా విలన్ గా మారింది. అయితే ఇది సినిమాలో కాదు ఓ ప్రముఖ సిరీస్ లో.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో చేసిన థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ సిరీస్ నే “రుద్ర”. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రాగా అందులో ప్రధాన ఆకర్షణగా రాశీ ఖన్నా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆమె హీరోయిన్ లా కాకుండా విలన్ గా కనిపించడంపై లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది.

ఈ సిరీస్ లో చాలా మంది విలన్స్ ఉంటారు అలాగే నేను కూడా ఒక విలన్ ని కానీ నా రోల్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి అంటుంది. అలాగే ఖచ్చితంగా ఈ సిరీస్ లో నా రోల్ అందరికీ షాకిచ్చేలా ఉంటుందని చెబుతుంది. మరి ఇప్పటికే మరో స్టార్ హీరోయిన్ సమంతా ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే సిరీస్ లో ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేసి ఆకట్టుకుందో చూసాము.

ఓ అగ్రెసివ్ విలన్ పాత్రలో స్టన్ చేసిన సమంతా థ్రిల్ చెయ్యగా ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా మంచి స్టెప్ తీసుకుంటుంది. మరి ఈమె ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే ఈ సిరీస్ తర్వాత రాశీ ఖన్నా తనపై రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా చెప్పింది. మరి ఈ సిరీస్ అయితే ఈ మార్చ్ 4 నుంచి హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.