Samantha : అందాల ఆరబోతలో సామ్ బాటలో చేరాలనుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్.?

Samantha : రీసెంట్ గా మన టాలీవుడ్ హీరోయిన్ సమంతా ప్రభు తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన లైఫ్ లో అనూహ్య మార్పు తర్వాత తన సినిమాల లైనప్ కానీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఎప్పటికప్పుడు ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా సామ్ తో పాటు తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యి కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో మరికొంత మంది బ్యూటీ లు సమాన స్టేటస్ తో టాలీవుడ్ లో కొనసాగారు.

మరి వారిలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ చేస్తూ కూడా తమన్నా పలు సినిమాల్లో కనిపించింది. అయితే రీసెంట్ గా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “గని” ఐటెం భామగా ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ లేటెస్ట్ గా రివీల్ చేశారు. అయితే ఈ సాంగ్ కి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు.

మరి దీనిని గమనిస్తే సామ్ తో పాటు తమన్నా కూడాఅందాల ఆరబోత కాస్త ఎక్కువగానే చేయనుంది అని అనిపిస్తుంది. ఇంతకు ముందు సాంగ్స్ లో అంతగా ఎప్పుడూ అనిపించలేదు కానీ ఈ సినిమా నుంచి జస్ట్ పోస్టర్ తోనే అర్ధం అవుతుంది. సో తాను కూడా ఇక నుంచి ఐటెం సాంగ్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేలా అనిపించట్లేదు అని చెప్పాలి.