Chaitanya and Pooja : ఈ సాలీడ్ సినిమాతో మళ్ళీ ఒకటి కాబోతున్న నాగ చైతన్య, పూజా హెగ్డేలు..?

Chaitanya and Pooja : తమ కెరీర్ లు ఆరంభంలో ఒకే సినిమాతో తమ సినిమాలు స్టార్ట్ చేసిన ఏ హీరో, హీరోయిన్ ల తాలూకా స్టార్డం కొన్నాళ్ల తర్వాత ఒకేలా ఉంటుందని చెప్పడం కుదరదు.. అలాంటి వారిలో భారీ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కొంతమంది ఉండగా తమ కెరీర్ ను ఎలా స్టార్ట్ చేసారో అలానే మిగిలిపోయిన కొందరు హీరోలు కూడా ఉన్నారు.

మరి ఇలా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే మారిపోయింది. అయితే తన కెరీర్ ఆరంభంలో బహుశా రెండో సినిమాగా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తో చేసిన చిత్రం “ఒక లైలా కోసం” చిత్రంలో కనిపించింది. ఈ ఇద్దరి కెరీర్ లో ఆ సినిమా మంచి లవ్ స్టోరీగా వచ్చినా ఎందుకో అంతలా ఆకట్టుకోలేకపోయింది.

కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరు ఓ బిగ్ ప్రాజెక్ట్ తో ఒకటి కాబోతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్ లో తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రం ‘మనాడు’ కి రీమేక్ ని తెలుగులో చేయబోతున్నారు. దానికి సంబంధించి హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ వారు కొనుగోలు చేయగా..

ఆ సినిమాలో ఈ ఇద్దరు యంగ్ యాక్టర్స్ నటించనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా స్ప్రెడ్ అవుతుంది. మరి చూడాలి దీనిపై ఏమన్నా అప్డేట్ వస్తుందో లేదో అనేది.