“ఎఫ్3” తర్వాత మరో సినిమా నార్మల్ రేట్స్ తో మరో సినిమా..క్లారిటీ ఇచ్చిన హీరో!

రీసెంట్ గా తెలుగు సినిమా లో మరో మార్పుకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు పూనుకున్న సంగతి తెలిసిందే. పలు భారీ సినిమాలకి పెంచుతున్న టికెట్ ధరల దెబ్బకు భారీ నష్టాలు తప్ప మరొకటి లేదని గ్రహించిన వీరు తమ ఎఫ్ 3 సినిమాకి మాత్రం అలాంటి తప్పు చేయకూడదు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ధరల పెంపు ఉండదని ఫ్యామిలీ ఆడియెన్స్ ని మేము వదులుకోలేమని తెలిపారు.

అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని చిత్రాలు కూడా వస్తాయి అని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ మరో సినిమా కూడా సాధారణ టికెట్ రేట్స్ తో వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమానే “మేజర్”. యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ పాన్ ఇండియా సినిమాగా మంచి అంచనాలతో వస్తుంది.

అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా స్వయంగా అడివి శేషే ఒక క్లారిటీ ఇచ్చాడు. తమ అదిరిపోయే సినిమాని సాధారణ ఆడియెన్స్ కి సాధారణ టికెట్ ధరలకే తీసుకొస్తున్నామని తెలిపాడు. దీనితో ఎఫ్ 3 తర్వాత మన తెలుగు సినిమాలో ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూ ఒక్క వారంలోనే ఈ సినిమా వస్తుందని చెప్పాలి.

ఇక ఈ చిత్రం తర్వాత మరిన్ని సినిమాలు కూడా ఇదే ఫార్మాట్ లో వస్తాయేమో చూడాలి. ఇంకా ఈ సినిమాలో గని ఫేమ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా శశికిరణ్ తిక్క దర్శకత్వం అందించాడు.