గత కొన్ని రోజులు కితమే టాలీవుడ్ లో అందరికీ ఎంతో ఇష్టం అయ్యినటువంటి పెళ్లి జంట సమంత (సామ్) అలాగే అక్కినేని నాగ చైతన్యలు తమ వివాహ బంధానికి శాశ్వతంగా బ్రేక్ ఇస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చేసారు. కానీ తర్వాత సామ్ కి ఎదురైన నిందలు అన్నీ ఇన్నీ కావు.
అయినప్పటికీ కూడా తన స్పందన తర్వాత తెలియజేసి తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేసింది. ఇక అలాగే అదే సమయంలో సామ్ విడాకులు తర్వాత తన సినీ కెరీర్ పడిపోతుంది అని చాలా మంది భావించారు. కానీ ఊహించని షాక్ వాళ్ళకి సామ్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.
ఆల్రెడీ తన మొట్టమొదటి బాలీవుడ్ ఎంట్రీ సినిమాకి సామ్ ఓకే చెయ్యడమే కాకుండా రాబోయే దసరాకి తన నుంచి మరిన్ని ప్రాజెక్ట్ లు అనౌన్స్ ఉందట. ఇలా విడాకులు తర్వాత తన కెరీర్ పై చాలా మందికి ఉన్న డౌట్స్ పై సామ్ మాత్రం గట్టి ఆన్సర్ చాలామందికే ఇచ్చింది అని చెప్పాలి.