‘పుష్ప’, ‘ఆచార్య’ స్పాట్ లో మాస్ మహారాజ్ అదిరే సీన్.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం “ఆచార్య” అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన భారీ సినిమా “పుష్ప” పార్ట్ 1 కూడా ఒకటి. అయితే ఈ రెండు సినిమాలకు కూడా ఆమధ్య ఒక కామన్ పాయింట్ కలిసింది అని ఆ మధ్య వార్తలు వినిపించాయి.

పుష్ప సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ సహా మరికొన్ని కీలక సన్నివేశాలు కోసం మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ చెయ్యగా అదే స్పాట్ లో తర్వాత ఆచార్య సినిమాకి కూడా అదిరే యాక్షన్ ఎపిసోడ్ నే చిత్ర యూనిట్ తెరకెక్కించారు.

ఇప్పుడు సరిగా మళ్ళీ ఇదే స్పాట్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కూడా సినిమాకి ఎంతో కీలకమైన ఏక్షన్ సీక్వెన్స్ ని ఇపుడు షూటింగ్ జరుపుకుంటున్నారట. ఇలా ఇదే స్పాట్ లో మూడు సినిమాలు ఒకే సీక్వెన్స్ లని తీయడం యాదృచ్చికం. అయితే ఈ సినిమాని కొత్త దర్శకుడు శరత్ మందవా తెరకెక్కిస్తున్నారు.