శేష్ తాత ఫ్రీడమ్ ఫైటర్.. తామ్రపత్రం కూడ ఉంది

Adivi Sesh shares his grandfather's Tamrapatra

Adivi Sesh shares his grandfather's Tamrapatra

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘క్షణం, ఎవరు, గూఢచారి’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు శేష్. అడివి శేష్ సినిమాలంటే ఒక ట్రేడ్ మార్క్ అభిప్రాయాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు వరుస ఫ్లాపులూ చూసిన శేష్ కోసం ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు తెగ ట్రై చేసున్నారు. నటుడిగానే కాదు రచయితగా కూడ శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. దేశభక్తి భావం పూర్తిగా నిండిన సినిమా ఇది.

ఈ సినిమాలో నటిస్తున్నదందుకు శేష్ చాలా సంతోషిస్తున్నాడు. పేట్రియాటిజం శేష్ కుటుంబంలో తరాల నుండి ఉంది. అందుకే తన కుటుంబం గురించిన ఒక విశేషాన్ని బయటపెట్టాడు. శేష్ తాతగారైన అడవి గంగరాజు ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్. పశ్చిమగోదావరిలోని ఏలూరు ఆయన సొంత ఊరు. స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు కృషి చేసినందుకుగాను 1973లో భారత ప్రభుత్వం ఆయనకు విశిష్టమైన తామ్రపత్రాన్ని అందించింది. దాన్ని ధృవీకరిస్తూ 1997లో అప్పటి వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ధృవీకరణ పత్రం జారీ చేశారు. దీన్నే సోషల్ మీడియాలో షేర్ చేసిన శేష్ తన తాతగారిని గుర్తుచేసుకున్నారు.