ఒక్క పూట భోజనం చేస్తూ పిల్లలని బ్రతికించుకున్నా.. షావుకారు జానకి షాకింగ్ కామెంట్స్!

ఏడు దశాబ్దాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించిన హీరోయిన్ షావుకారు జానకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటించిన మొదటి చిత్రం షావుకారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమె పేరుకు ముందు షావుకారు అని పేరు రావడంతో ఈమె షావుకారు జానకిగా ఇండస్ట్రీలో కొనసాగారు. ఇలా ఎన్నోఅద్భుతమైన సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న షావుకారు జానకి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలో ఎంతో డబ్బు సంపాదించానని సంపాదించిన డబ్బు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టానని ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశానని తెలిపారు. అయితే తన భర్త పూర్తిగా తాగుడికి బానిస అయ్యి ఆస్తులన్నింటినీ ఖర్చు చేస్తూ వచ్చాడని షావుకారు జానకి ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా తన భర్త తాగుడుకు బానిసకాకపోయి ఆస్తులు అన్ని అలాగే ఉంటే ప్రస్తుతం తనకు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉండేవని ఈమె తెలియజేశారు.

ఈ విధంగా తన భర్తతో కలిసి ఉంటే ఉన్న ఆస్తులు కూడా ఖర్చు అయిపోతాయని భావించిన షావుకారు జానకి తన భర్త నుంచి విడాకులు తీసుకున్నానని తెలిపారు. ఈ విధంగా ఒకానొక సమయంలోఎంతో కష్టపడుతూ తాను కేవలం ఒక్క పూట భోజనం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా షావుకారు జానకి వెల్లడించారు.ఈ విధంగా షావుకారు జానకి తన సినీ జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.