బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై పోసాని మాట ఇది!

న‌టుడు, హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల సినిమా ఇండ‌స్ర్టీ-కేసీఆర్ భేటీల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. భూములు పంచుకోవ‌డానికే మీటింగులు పెట్టుకున్నారు.. ఆవిష‌యం నాకు తెలియ‌దు అన్న‌ట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు టాలీవుడ్ స‌హా రెండు రాష్ర్టాల రాజ‌కీయా వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారి తీసాయి. మెగా అభిమానులు-నంద‌మూరి అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌గాదాకు దిగారు. ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అయితే బాల‌య్య వ్యాఖ్య‌లు వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. అలాగే బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు.

అయితే తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి స్పందించారు. బాల‌య్య‌కు కోపం ఎక్కువే. ఆ కోపానికి ఓ కార‌ణం కూడా ఉంటుందన్నారు. ఏదైనా బాల‌య్య ముఖం మీద మాట్లాడేస్తారు..త‌ప్పుఒప్పు గురించి ఆలోచించ‌రు. ముఖానికి మేక‌ప్ ఉన్న‌ప్పుడు -లేన‌ప్పుడు ఒకేలా స్పందిస్తారు. చాలా మంచి మ‌నిషి. అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డే త‌త్వం అతినిది కాదు. బాల‌య్యే కాదు. ఆ కుటుంబం అంతా ఎంతో గొప్ప‌ది. ఆ కుటుంబంలో ఎవ‌రికీ అవినీతి మ‌ర‌ల‌కు అంట‌లేద‌న్నారు. ఎన్టీఆర్ కొడుకులంద‌రు క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చార‌న్నారు. బాల‌య్య అంద‌ర్నీ ప్రేమ‌గా, గౌర‌వంగా చూసుకుంటార‌న్నారు.

అలాగే చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. చిరంజీవి చాలా మంచి వారు. ఆయ‌న‌కు మ‌రీ అంత మంచి త‌నం ప‌నికిరాద‌న్నారు. చిరంజీవితో ఖైదీ నెంబ‌ర్ 150 లో న‌టించా. అల్లుడా మ‌జాకా సినిమాకి నేను క‌థ అందిచాన్నారు. సినిమా ఇండ‌స్ర్టీలో ఇద్దరు పెద్ద‌స్టార్స్ అయిన చిరంజీవి, బాల‌య్య ఇద్ద‌రు మంచి వారేన‌ని అడిగిన అస‌లు ప్ర‌శ్న‌కి స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకున్నారు పోసాని. అయితే ఏ విష‌యంపై నైనా ముక్కు సూటిగా మాట్లాడే పోసాని ఇది రాజ‌కీయంగా దుమారం రేపే అవ‌కాశం ఉండ‌టంతోనే మాట్లాడ‌లేద‌ని ఫిల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది.